ఉదయకళేశ్వరుడ్ని దర్శించిన డ్యాన్స్‌మాస్టర్‌ శేఖర్‌

Nov 30 2021 @ 23:16PM
గండవరం ఆలయంలో సినీ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌

కొడవలూరు, నవంబరు 30 : ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ మంగళవారం గండవరంలోని పురాతన శ్రీఉదయకళేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నార్తురాజుపాళెంలోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు ఆలయాల్లోని   పూజారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మిత్రులు, కుటుంబసభ్యులతో కలసి పురాతన శ్రీఉదయకళేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.