రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే ఉద్ధవ్‌కు బిగ్ షాక్..

ABN , First Publish Date - 2022-07-19T01:24:02+05:30 IST

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేకు బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ ఎంపీలంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాసేపటికే వారంతా ఆయనకు షాకిచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే ఉద్ధవ్‌కు బిగ్ షాక్..

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేకు బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ ఎంపీలంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాసేపటికే వారంతా ఆయనకు షాకిచ్చారు. శివసేన పార్టీ ఎంపీల్లో 12 మంది ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌తో టచ్‌లో ఉన్నారని, వారు ఈ రాత్రికే ఢిల్లీకి పయనమౌతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కూడా ఈ రాత్రికే ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలను కలుసుకుంటారు. 


జులై 8న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ఏక్‌నాథ్ షిండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దాను కలుసుకున్నారు. శివసేనకు లోక్‌సభలో 18 మంది ఎంపీలుండగా వీరిలో 12 మంది ఏక్‌నాథ్‌ షిండేతో టచ్‌లో ఉన్నారు. ధైర్యశీల్ శంభాజీ రావ్, సదాశివ్ లోఖండే, హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్, రాజేంద్ర గవిట్, సంజయ్ మండ్లిక్, శ్రీకాంత్ షిండే (సీఎం ఏక్‌నాథ్ షిండే తనయుడు), శ్రీరంగ్ బర్నే, రాహుల్ షెవాలే, ప్రతాప్‌ రావ్ గణపతిరావ్ జాదవ్, కృపాల్ తుమానే, భావనా గావ్లి సీఎం ఏక్‌నాథ్‌తో సంప్రదింపుల్లో ఉన్నారని జాతీయ మీడియా కథనాల సారాంశం. 


రాష్ట్రపతి ఎన్నికలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఎంపీల విషయంలో ఏక్‌నాథ్ షిండే కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎన్నికలు కూడా ముగియడంతో ఆయన తనకు మద్దతిస్తోన్న 12 మంది ఎంపీలను బీజేపీ అధిష్టానానికి పరిచయం చేస్తారని సమాచారం. 


మహారాష్ట్రలో రెండున్నరేళ్ల పాటు కొనసాగిన శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారుకు వ్యతిరేకంగా ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. బీజేపీతో కలిసి ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు.  

Updated Date - 2022-07-19T01:24:02+05:30 IST