ఉద్ధవ్ థాకరే బావమరిది కార్యాలయంపై ఈడీ దాడి

ABN , First Publish Date - 2022-03-23T01:07:42+05:30 IST

మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బావమరిది శ్రీధర్..

ఉద్ధవ్ థాకరే బావమరిది కార్యాలయంపై ఈడీ దాడి

ముంబై: మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బావమరిది శ్రీధర్ మాధవ్ పాటంకర్ ‌కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం దాడులు జరిపింది. రూ.6.45 కోట్ల  విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. థానేలోని నీలాంబర్ ప్రాజెక్ట్‌లో రెసిడెన్షియల్ యూనిట్లతో సహా రూ.6 కోట్లకు పైబడిన స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టం కింద 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను జప్తు చేసేందుకు ప్రొవిజనల్ ఆర్డర్‌ను జారీ  చేసినట్టు ఈడీ తెలిపింది. శ్రీ సాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్ మహదేవ్ పాటంకర్ సొంత సంస్థగా పేర్కొంది. శ్రీధర్ మహదేవన్ స్వయానా థాకరే భార్య రష్మికి సోదరుడు. కాగా, ఈడీ దాడులను రాజకీ ప్రతీకార దాడులుగా శివసేన ఆక్షేపించింది.

Updated Date - 2022-03-23T01:07:42+05:30 IST