ఉద్ధవ్ వస్తానన్నా స్వాగతిస్తాం: అసోం సీఎం

ABN , First Publish Date - 2022-06-24T22:29:46+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీ వ్యూహం పన్నిందని, సేన రెబల్ ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్‌లో అసోంలోని..

ఉద్ధవ్ వస్తానన్నా స్వాగతిస్తాం: అసోం సీఎం

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీ వ్యూహం పన్నిందని, సేన రెబల్ ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్‌లో అసోంలోని బీజేపీ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ (Himant Biswa Sharma) తోసిపుచ్చారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో శర్మ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని రాకుండా ఏ ఒక్కరినీ తాను ఆపనని, ఉద్ధవ్ థాకరే (మహారాష్ట్ర సీఎం) కూడా రావచ్చని అన్నారు.


''దేశంలోని ఎమ్మెల్యేలందరినీ అసోంలో పర్యటించమని ఆహ్వానిస్తున్నాను. అలాంటప్పుడు ఒక హోటల్‌కు వచ్చిన వారిని నేను ఎలా ఆపుతాను. అసోంలోని హోటల్స్‌కు రావద్దని నన్ను చెప్పమంటారా? దేశంలో సమాఖ్య వ్యవస్థ నడుస్తోంది. అసోంకి ఎవ్వరు వచ్చినా నాకు సంతోషమే. వాళ్లు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా ఉండొచ్చు. వెకేషన్ (Vacation) కోసం ఆయన (ఉద్ధవ్ థాకరే) కూడా ఇక్కడకు రావచ్చు'' అని శర్మ అన్నారు.

Updated Date - 2022-06-24T22:29:46+05:30 IST