అప్పుడు కుర్చీ పంపకానికి ఎందుకు ఒప్పుకోలేదు?: బీజేపీకి ఉద్ధవ్ ప్రశ్న

ABN , First Publish Date - 2022-07-01T21:27:16+05:30 IST

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘బీజేపీకి ఇప్పుడు దొరికిన ఆనందం ఏంటో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి ఏం రాలేదు. మరి అలాంటప్పుడు కుర్చీ పంపకంపై అప్పుడు ఎందుకు వ్యతిరేకించనట్టు?’’ అని అన్నారు..

అప్పుడు కుర్చీ పంపకానికి ఎందుకు ఒప్పుకోలేదు?: బీజేపీకి ఉద్ధవ్ ప్రశ్న

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra chief minister)గా రాజీనామా చేసిన రెండు రోజులకు మీడియా ముందుకు వచ్చారు ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray). వస్తూ వస్తూనే భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ముఖ్యమంత్రి కుర్చీ పంపకానికి ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ దీని వల్ల సాధించిందేమని విమర్శించారు. తనను బెదిరించినట్లు ప్రజల్ని బెదిరించవద్దని విజ్ణప్తి చేశారు. ముంబైని వెనుకబాటు గురి చేయకుండా పాలించాలని ఉద్ధవ్ సూచించారు.


శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘బీజేపీకి ఇప్పుడు దొరికిన ఆనందం ఏంటో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి ఏం రాలేదు. మరి అలాంటప్పుడు కుర్చీ పంపకంపై అప్పుడు ఎందుకు వ్యతిరేకించనట్టు?’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నన్ను వెనక్కి నెట్టారు. ముంబైని వెనక్కి నెట్టకండి. ఆరే కాలనీ విషయంలో నిర్ణయం మార్పుకోవడం సరైంది కాదు. మేం దానికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించాం. అది నచ్చకపోతే ఆరేకు నష్టం జరక్కుండా ఇంకా ఎలా అయినా ఆలోచించండి. పర్యావరణ సహితంగా నిర్ణయం తీసుకోండి’’ అని అన్నారు.


ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జరిగిన మొదటి క్యాబినెట్ మీటింగ్‌లో ఆరెపై మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిరగరాశారు. మెట్రో లైన్-3 కార్ షెడ్‌ను ఆరె కాలనీ నుంచి కంజుర్‌మార్గ్‌కు మార్చారు. దీనిని కంజుర్‌మార్గ్‌ నుంచి మళ్లీ ఆరె కాలనీకి మారుస్తూ తాజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-07-01T21:27:16+05:30 IST