Advertisement

సీఎంతో మీటింగ్‌...పాట పాడిన సింగర్‌

Sep 23 2020 @ 10:34AM

రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలోని ప్రముఖులతో ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సినీ రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలపై ఆయన వారితో చర్చిస్తుండగా మీటింగ్‌లో కూర్చున్న ఓ సీనియర్‌ సింగర్‌ వెంటనే నిలబడి, ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ గతంలో ఓ సినిమాలో తాను పాడిన పాటను పాడి.. ఆయనకు అంకితమిచ్చారు. ఇంతకూ ఆ పాట పాడిన సింగర్ ఎవరో కారు.. ఉదిత్‌ నారాయణ్‌. ఈయన పాట అంకితమందుకున్న ఆ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.


Advertisement

రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, దేశంలోనే అతి పెద్ద ఫిలింసిటీని నోయిడాలో నిర్మించాలనుకుంటున్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చర్చ జరపడానికి కొందరు సినీ ప్రముఖులను ఆయన మీటింగ్‌కు ఆహ్వానించారు. తాను ఓ అతి పెద్ద ఫిలింసిటీని కట్టాలనుకుంటున్న యోగి ఆదిత్యనాథ్‌ చెప్పగానే ఉదిత్‌ నారాయణ్‌ కుర్చీలో నుండి లేచి 'లగాన్‌' సినిమాలోని 'మితువా మితువా...' పాటను పాడారు. పాట విన్న యోగి ఆదిత్యనాథ్‌,  ఉదిత్‌ నారాయణ్‌కు నమస్కారం చేశారు. ఇప్పుడు ఈ పాట వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.