ఉద్యానవన మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-19T06:14:14+05:30 IST

ఉద్యానవన మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలి

ఉద్యానవన మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలి
అధికారులతో జూమ్‌కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

అధికారులకు జూమ్‌కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం 

పాడేరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఉద్యానవన మొక్కలు నటే ప్రక్రియను వేగవంతం చేసి ఈనెలాఖరు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. ఏజెన్సీలో అభివృద్ధిపనులపై వివిధ శాఖల అధికారులతో గురువారం సాయంత్రం నిర్వహించిన జూమ్‌కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. చెరువులున్న ప్రతి గ్రామ పంచాయతీలో అమృత్‌ సరోవర్‌ కింద వాటిని అభివృద్ధి చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న మిషన్‌ అమృత్‌ సరోవర్‌, లేబర్‌ మెబలైజేషన్‌, స్వచ్ఛ సంకల్పం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ, జాబ్‌ కార్డుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై ఉపాధి హామీ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షించారు. పర్యాటక ప్రాంతాలలో ప్లాస్టిక్‌ నిషేధం, పరిశుభ్రతపై బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 

గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడుతూ... వివిధ గ్రాంట్‌ల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, రోడ్లు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ స్కూళ్ల భవనాల నిర్మాణ పనుల పురోగతి, తాజంగిలో స్వాతంత్ర సమర యోధుల మ్యూజియమ్‌ నిర్మాణంపై సమీక్షించారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడుతూ.... ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు పురోగతిపై ఆరా తీసారు. చింతపల్లి మండలం జాజులపాలెం నుండి అంజలి శనివారం , పెదబయలు మండలం గుల్లెలు నుంచి కోండ్రుం రోడ్డు పనులు, జామిగుడ రోడ్డు పనులపై పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు                                                                                       చింతపల్లి - సీలేరు ప్రధాన రహదారి నిర్మిణాపు పనులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నాడు నేడు పనుల ఏస్థాయిలో ఉన్నాయని రహదారులు భవనాల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్‌ కనెక్ట్‌ పాడేరు, మన బడి నాడు నేడు పనులను వేగవంతం చేయాలని  అధికారులను ఆదేశించారు. 

ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు,  కె.వేణుగోపాల్‌, ఉపాధి హామీ ఏపీడీ జె.గిరిబాబు, ఏజెన్సీ మండలాల ఎంపీడీవోలు ఉపాధి హామీ ఏపీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.




Updated Date - 2022-08-19T06:14:14+05:30 IST