మార్కెట్‌కు ఉగాది శోభ!

ABN , First Publish Date - 2021-04-13T04:49:55+05:30 IST

లోని ప్రధాన మార్కెట్లు అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలోకి మారాయి. ఎన్నడూ లేనంతగా పూజా సామగ్రి, పండ్లు, కొబ్బరికాయలు, పువ్వుల ధరలు అమాంతం పెరిగాయి. కొబ్బరికాయ ధర రూ. 30 నుంచి రూ.35 వరకూ పలికింది. మూర పువ్వుల ధర రూ

మార్కెట్‌కు ఉగాది శోభ!
జనాలతో రద్దీగా కనిపిస్తున్న విజయనగరంలోని ప్రధాన మార్కెట్‌





జనాలతో రద్దీ

భారీగా పెరిగిన పూజా సామగ్రి ధరలు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఏప్రిల్‌ 12 : తెలుగు వారి సంస్కృతికి ప్రతీక ఉగాది. సకలశుభాలకు తొలి మెట్టుగా భావిస్తారు. ఈ పర్వదినానే అన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా   అవసరమైన పూజా సామగ్రిని ప్రజలు కొనుగోలు చేశారు. దీంతో సోమవారం ప్రధాన మార్కెట్లు జనాలతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంతో పాటు  అన్ని పట్టణాల్లోని మార్కెట్లు రద్దీగా కనిపించాయి. విజయనగరంలోని ప్రధాన మార్కెట్లు అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలోకి మారాయి. ఎన్నడూ లేనంతగా పూజా సామగ్రి, పండ్లు, కొబ్బరికాయలు, పువ్వుల ధరలు అమాంతం పెరిగాయి. కొబ్బరికాయ ధర రూ. 30 నుంచి రూ.35 వరకూ పలికింది. మూర పువ్వుల ధర రూ.60 నుంచి రూ.70 వరకూ పలుకగా..చిన్నపాటి మామిడి కాయ సైతం రూ.20 వరకూ విక్రయించారు. ధరలు పెరిగినా తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ మంది కొనుగోలు చేశారు. కూరగాయల ధరలు కూడా పెరిగాయి. మరోవైపు బంగారం, వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతూ కనిపించాయి. 





Updated Date - 2021-04-13T04:49:55+05:30 IST