భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక: వెంకయ్య

Published: Sat, 02 Apr 2022 19:20:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక: వెంకయ్య

శంషాబాద్‌: భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక అని భారత ఉపరాప్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ముచ్చింతల్‌ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాలాన్ని గౌరవించడం, ప్రకృతిని పరిరక్షించడమే ఉగాది సందేశమని తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ పేర్లతో ఈపండగను జరుపుకుంటారని, వేరువేరు భాషలు, వేరువేరు పేర్లు, వేరవేరు సంప్రదాయాల మధ్య ప్రాధాన్యత కలిగిన పండగగా ఉగాది నిలిచిందన్నారు. ఉగాదితోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాదిని జరుపుకుంటున్నామని చెప్పారు. శుభకృత్‌ అంటే మేలును కలిగించేదని అర్థమని, ఈపండగ అందరి జీవితాల్లోకి సానుకూల మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు. వసంత రుతువు ఆగమనానికి ప్రతీక అయిన ఉగాది వేళ వాతావారణంలో స్పష్టమైన మార్పు కనబడుతోందని చెప్పారు. ఉగాది పండగలోని ప్రతి సంప్రదాయం వెనుక వైజ్ఞానిక రహస్యాలు ముడిపడి ఉన్నాయని వెంకయ్యనాయుడు చెప్పారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.