సూర్య నమస్కార కార్యక్రమంలో పాల్గొనండి : యూజీసీ

ABN , First Publish Date - 2022-01-18T17:58:23+05:30 IST

గణతంత్ర దినోత్సవాల్లో సూర్య నమస్కార కార్యక్రమాల్లో

సూర్య నమస్కార కార్యక్రమంలో పాల్గొనండి : యూజీసీ

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాల్లో సూర్య నమస్కార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉన్నత విద్యా సంస్థలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కోరింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జాతీయ క్రీడల సమాఖ్య సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 


యూజీసీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, అమృత్ మహోత్సవ్ సందర్భంగా జనవరి 1 నుంచి 7 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 750 మిలియన్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనిలో 30 వేల సంస్థలు, 3 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులను భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. అదేవిధంగా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జనవరి 26న జాతీయ జెండా ముందు మ్యూజికల్ సూర్య నమస్కారాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమాల్లో అన్ని ఉన్నత విద్యా సంస్థలు, అనుబంధ కళాశాలలు భాగస్వాములు కావాలని కోరింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని కోరింది. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.


Updated Date - 2022-01-18T17:58:23+05:30 IST