గజ్వేల్‌లో రూ.99 కోట్లతో యూజీడీ పనులు

May 7 2021 @ 00:16AM
హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేస్తున్న వంటేరు

ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు 

గజ్వేల్‌, మే 6: యూజీడీ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట యూజీడీ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.99కోట్ల వ్యయంతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే గజ్వేల్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఆయనవెంట నాయకులు రవిందర్‌, సందీ్‌పరెడ్డి, హన్మంత్‌రెడ్డి, అహ్మద్‌ తదితరులున్నారు. 


ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలి

రెండో దశ కరోనా తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, కరోనాను కట్టడి చేయాలని టీఎ్‌సఎ్‌ఫడీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి కోరారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 7, 8వ వార్డుల్లో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీలతో కలసి సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయిస్తామన్నారు. కరోనా మహామ్మారి నివారణకు ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరాన్ని, రాత్రిపూట కర్వ్యూను పాటించాలన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు కూరాకుల శ్రీనివాస్‌, అబ్ధుల్‌ రహీం, నాయకులు రవిందర్‌, శ్రీధర్‌, నవాజ్‌మీరా, హన్మంతరెడ్డి, అహ్మద్‌, స్వామిచారీ తదితరులున్నారు.  

Follow Us on: