హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భుయాన్
ABN , First Publish Date - 2022-06-28T08:26:51+05:30 IST
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు...
నేడు ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ప్రొటోకాల్ ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంటుంది. గవర్నర్‌కు, సీఎం కేసీఆర్‌కు ఉన్న విభేదాల నేపథ్యంలో ఈసారి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై తొలుత సందేహం ఏర్పడింది. అయితే ఈ కార్యక్రమానికి ఆయన వెళ్తారని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.