America: ప్రవాస భారతీయుడికి అరుదైన గౌరవం.. సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా నియామకం

ABN , First Publish Date - 2022-09-05T16:19:07+05:30 IST

అమెరికాలో భారత సంతతి(Indian American)కి చెందిన ప్రజలు అత్యధికంగా నివసించే నగరమైన న్యూ జెర్సీ(New Jersey) రాష్ట్రంలోని ఎడిసన్ నగరం సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కాస్థల(Ujjwal Kasthala) నియమితులయ్యా

America: ప్రవాస భారతీయుడికి అరుదైన గౌరవం.. సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా నియామకం

ఎన్నారై డెస్క్: అమెరికాలో భారత సంతతి(Indian American)కి చెందిన ప్రజలు అత్యధికంగా నివసించే నగరమైన న్యూ జెర్సీ(New Jersey) రాష్ట్రంలోని ఎడిసన్ నగరం సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కాస్థల(Ujjwal Kasthala) నియమితులయ్యారు. ఉజ్వల్ గత పదేళ్లుగా ఎడిసన్ నగరంలో నివసిస్తూ ప్రవాస భారతీయ సంఘాల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. న్యూ జెర్సీ రాష్ట్రంలో ఐదవ పెద్ద నగరమైన ఎడిషన్ నగర జనాభా లక్షకు పైగా ఉంటే అందులో  దాదాపు 30 శాతం భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. లిటిల్ ఇండియాగా పిలవబడే ఓక్ ట్రీ రోడ్ ఎడిసన్ నగరంలోనే ఉంది. ఇదిలా ఉంటే.. 2022 జనవరిలో జరిగిన మేయర్ ఎన్నికలలో మొదటిసారి భారత సంతతి కి చెందిన సామ్ జోషి ఎడిసన్ మేయర్ గా ఎన్నికయ్యారు.


Updated Date - 2022-09-05T16:19:07+05:30 IST