వ్యాక్సిన్ వేయించుకోలేదని కన్నకూతురికి ‘నో ఎంట్రీ‘

ABN , First Publish Date - 2021-09-13T21:14:10+05:30 IST

‘నో మాస్క్ నో ఎంట్రీ‘ అనే బోర్డులు మనం ఇప్పటికి చాలా నెలలుగా చూస్తూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ‘నో వ్యాక్సినేషన్ నో ఎంట్రీ‘ అనే నినాదం కూడా మొదలైపోయింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాంటి కల్లోలాల కారణంగా ఇంకా జనం బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్నది కేవలం టీకా తరుణోపాయం మాత్రమే.

వ్యాక్సిన్ వేయించుకోలేదని కన్నకూతురికి ‘నో ఎంట్రీ‘

‘నో మాస్క్ నో ఎంట్రీ‘ అనే బోర్డులు మనం ఇప్పటికి చాలా నెలలుగా చూస్తూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ‘నో వ్యాక్సినేషన్ నో ఎంట్రీ‘ అనే నినాదం కూడా మొదలైపోయింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాంటి కల్లోలాల కారణంగా ఇంకా జనం బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్నది కేవలం టీకా తరుణోపాయం మాత్రమే. అందుకే, థియేటర్ల వంటి చాలా పబ్లిక్ ప్లేసెస్‌‌‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తున్నారు. అయితే, ఇంగ్లాండ్‌లోని ఓ మహిళా బార్ ఓనర్ మరో అడుగు ముందుకేసి స్వంత కూతుర్ని కూడా టీకా వేసుకోనిదే లోనికి రానివ్వనన్నదట...


యూకేలోని ప్లైమౌత్ నగరంలో ‘మినర్వా ఇన్’ అనే బార్ ఉంది. దాని యజమానురాలు షెల్లీ జోన్స్. ఆమె తన రెగ్యులర్ కస్టమర్స్‌కి, ముఖ్యంగా... 80, 90 ఏళ్ల వయస్సు పైబడ్డ వారి భద్రతని దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకుంది. తన బార్‌లోకి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపకుండా ఎవ్వరూ రాకూడదని షెల్లీ షరతు విధించింది. అయితే, రీసెంట్‌గా ఆమె కూతురు బార్‌లోనికి రాబోయిందట. కానీ, తనని కూడా షెల్లీ వెళ్లిపొమ్మని కరాఖండిగా చెప్పిందట. అంత నిజాయితీగా, నిఖార్సుగా నియమాన్ని పాటించటం ఇప్పుడు అందరి ప్రశంసల్ని అందుకుంటోంది. అయితే, షెల్లీ తాను తీసుకున్న నిర్ణయం కరోనాని పూర్తిగా అరికట్టదని అంటూనే కొంతైనా ప్రభావం మాత్రం చూపుతుందని వాదిస్తోంది. ఆమెకు భర్త కూడా మద్దతు పలుకుతున్నాడు. ఎటొచ్చి కొందరు సొషల్ మీడియా యూజర్స్ మాత్రం తప్పుబడుతున్నారు.


ముసలి వారికి ముందుగా వ్యాక్సినేషన్స్ ఇస్తున్నప్పుడు చాలా మంది యూకే యూత్ టీకాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అలాగే, ఇతరత్రా అనారోగ్య కారణాల వల్ల కూడా కొందరు ఇంకా జ్యాబ్స్ తీసుకోలేదు. అటువంటి వారందర్నీ షెల్లీ లాంటి వారు కఠిన నిర్ణయాలతో బార్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్‌లోకి అలౌ చేయకపోతే ఎలా అంటున్నారు. వారి వాదనలోనూ కొంత నిజం లేకపోలేదు. చూడాలి మరి, ‘నో వ్యాక్సినేషన్ నో ఎంట్రీ‘ రూల్‌పై ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కుతారేమో...          

Updated Date - 2021-09-13T21:14:10+05:30 IST