18km నడిచిన polling booth చేరుకున్న Election Chief

ABN , First Publish Date - 2022-06-05T21:01:36+05:30 IST

రిమోట్ ఏరియాల్లో పోలింగ్ బూత్‌లను సందర్శించాలని నిర్ణయించుకున్నాను. అందుకు మొదట డుమాక్, కల్గోత్ పోలింగ్‌ బూత్‌లను ముందుగా సందర్శించాలని నిర్ణయించుకున్నాను. సుమారు 18 కిలీమీటర్లు నడిస్తే కానీ ఇక్కడి వరకు రాలేకపోయాను. రాష్ట్రంలో ఇలాంటి పోలింగ్ బూత్‌లు అనేకం ఉన్నాయి..

18km నడిచిన polling booth చేరుకున్న Election Chief

డెహ్రడూన్: కొండ ప్రాంతాలు, అడవులు లాంటి రిమోట్ ఏరియాల్లో పోలింగ్ నిర్వహించడం అంత సులభం కాదు. అక్కడికి వెళ్లి సరైన సమయంలో పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాగా ఇబ్బందుల్ని తెలుసుకోవడానికి కొండ ప్రాంతాల్లోని పోలింగ్‌ బూత్‌లకు స్వయంగా 18 కిలోమీటర్లు నడిచివెళ్లారు ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. శుక్రవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఛమోలి జిల్లాలోని డుమాక్, కల్గోత్ గ్రామాల్లో ఉన్న పోలింగ్‌‌ బూత్‌లను రాజీవ్ సందర్శించారు. ఈ బూత్‌ను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడికి చేరుకోవడానికి సిబ్బందికి సుమారు మూడు రోజుల సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం సందర్శించిన బూత్‌లే కాకుండా రిమోట్ ఏరియాల్లోనే మరిన్ని బూత్‌లను సందర్శించి, ఎన్నికల నిర్వహణలోని అక్కడి సమస్యలను, సవాళ్లను తెలుసుకుంటానని తెలిపారు.


‘‘రిమోట్ ఏరియాల్లో పోలింగ్ బూత్‌లను సందర్శించాలని నిర్ణయించుకున్నాను. అందుకు మొదట డుమాక్, కల్గోత్ పోలింగ్‌ బూత్‌లను ముందుగా సందర్శించాలని నిర్ణయించుకున్నాను. సుమారు 18 కిలీమీటర్లు నడిస్తే కానీ ఇక్కడి వరకు రాలేకపోయాను. రాష్ట్రంలో ఇలాంటి పోలింగ్ బూత్‌లు అనేకం ఉన్నాయి. వాటన్నిటీని సందర్శించాలి. ఇక్కడికి వచ్చి పోలింగ్ నిర్వహించే సిబ్బంది ఎదుర్కొంటున్న కష్టాలు, సవాళ్లను తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రాంతాల్లో ఓటర్ల అవసరాలను తెలుసుకుని వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను’’ అని రాజీవ్ అన్నారు. డుమాక్, కల్గోత్ పోలింగ్ బూత్‌లు బద్రీనాథ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాగా, రాష్ట్రంలోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక శుక్రవారం విడుదల అయ్యాయి. ఈ ఎన్నికలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 55,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Updated Date - 2022-06-05T21:01:36+05:30 IST