గడ్డు కాలం రాబోతోంది: బ్రిటన్ ప్రధాని

ABN , First Publish Date - 2021-01-22T06:04:53+05:30 IST

బ్రిటన్‌లో కొవిడ్-19 కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ప్రతి రోజు వేలలో ఉంటోంది. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్-19 మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థా

గడ్డు కాలం రాబోతోంది: బ్రిటన్ ప్రధాని

లండన్: బ్రిటన్‌లో కొవిడ్-19 కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ప్రతి రోజు వేలలో ఉంటోంది. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్-19 మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. గడ్డు కాలం రాబోతోందని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో యూకేలో 1,820 కొవిడ్ మరణాలు నమోదైన క్రమంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. నిన్న ఒక్కరోజే యూకేలో దాదాపు 39వేల మంది కొవిడ్ బారినపడ్డారు. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో కొవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 93వేలు దాటింది. ప్రాణాలు కోల్పోయిన వారు.. కొవిడ్ సోకిన 28 రోజుల్లోనే తుది శ్వాస విడిచినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా  ఉంటే.. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ బయటపడిని విషయం తెలిసిందే. అది కొవిడ్ -19 కన్నా 70శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే పలు నివేదలు వెల్లడించాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 


Updated Date - 2021-01-22T06:04:53+05:30 IST