Rishi Sunak: సీన్‌ రివర్స్‌.. రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ.. అనూహ్యంగా లిజ్‌కు పెరిగిన మద్దతు

ABN , First Publish Date - 2022-07-23T13:19:23+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

Rishi Sunak: సీన్‌ రివర్స్‌.. రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ.. అనూహ్యంగా లిజ్‌కు పెరిగిన మద్దతు

లిజ్‌ ట్రస్‌కే టోరీ సభ్యుల మద్దతు

లండన్‌, జూలై 22: బ్రిటన్‌ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ రిషికి గట్టి పోటీ ఇస్తున్న విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ తన ఆధిక్యాన్ని గణనీయంగా పెంచుకున్నారు. బోరిస్‌ జాన్సన్‌ స్థానం కోసం బరిలో నిలిచిన సునాక్‌, ట్రస్‌ ఇద్దరినీ పోటీ చివరి దశకు పంపేందుకు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ(టోరీ) సభ్యులు గురువారం ఓట్లేశారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు ప్రారంభం వరకూ జరిగే ఓటింగ్‌లో వీరిద్దరిలో ఒకరిని తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటారు. 2019లో అర్హులైన టోరీ సభ్యుల సంఖ్య 1,60,000 కాగా ప్రస్తుతం వీరి సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. కాగా, రిషి, లిజ్‌ ట్రస్‌లలో టోరీ సభ్యుల మద్దతు ఎవరికి అనే అంశంపై బ్రిటన్‌లో ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌, అనలిటిక్స్‌ సంస్థ అయిన ‘యూగోవ్‌’ బుధ, గురువారాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న 730మంది సభ్యుల్లో 62శాతం ట్రస్‌కే మద్దతు తెలిపారు. 38శాతం రిషి సునాక్‌కు ఓటేస్తామని చెప్పారు. సర్వేల్లో రెండ్రోజుల క్రితం వరకూ 20శాతం ఆధిక్యం సాధించిన లిజ్‌ ట్రస్‌ ఇప్పుడు 24శాతం లీడ్‌కు ఎగబాకారు. 

Updated Date - 2022-07-23T13:19:23+05:30 IST