
లండన్ : రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ దేశానికి బ్రిటన్ సాయం అందించింది. రష్యా దళాలతో పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యానికి బ్రిటన్ 6వేల క్షిపణులను, 25 మిలియన్ పౌండ్లను ఆర్థిక సహాయంగా పంపుతుందని ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వెల్లడించారు.యాంటీ ట్యాంక్ అధిక పేలుడు ఆయుధాలను బ్రిటన్ ఉక్రెయిన్ దేశానికి పంపించిందని జాన్సన్ చెప్పారు.రష్యా దేశంపై ఆర్థిక ఆంక్షలను రెట్టింపు చేయడంతోపాటు ఉక్రెయిన్ దేశానికి మెరుగైన రక్షణాత్మక మద్ధతు ఇస్తామని జాన్సన్ పేర్కొన్నారు.‘‘యునైటెడ్ కింగ్డమ్ ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక మద్దతును పెంచడానికి మా మిత్రదేశాలతో కలిసి పని చేస్తుంది’’ అని జాన్సన్ తెలిపారు.
లండన్ ఇప్పటికే 4వేల యుద్ధ ట్యాంకులు, లైట్ యాంటీ ట్యాంక్ వెపన్స్ సిస్టమ్స్, జావెలిన్ క్షిపణులను అందించింది.రష్యా వైమానిక బాంబు దాడులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ దేశానికి శరీర కవచాలు, హెల్మెట్లను సరఫరా చేస్తోంది.ఉక్రెయిన్ రష్యా దండయాత్రను అరికట్టడంలో బ్రిటన్ పంపిన హార్డ్‌వేర్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇవి కూడా చదవండి