UK: విమానంలో ప్రయాణిస్తూ నిద్రలోనే కన్నుమూసిన మహిళ!

ABN , First Publish Date - 2022-08-10T22:36:43+05:30 IST

భర్త, పిల్లలతో పక్కనే కూర్చుని విమానంలో ప్రయాణిస్తూ ఓ మహిళ నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత నిద్రలోనే ఆమె కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంత మంది వ్యక్తులు సదరు మహిళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరు

UK: విమానంలో ప్రయాణిస్తూ నిద్రలోనే కన్నుమూసిన మహిళ!

ఎన్నారై డెస్క్: భర్త, పిల్లలతో పక్కనే కూర్చుని విమానం(Flight)లో ప్రయాణిస్తూ ఓ మహిళ నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత నిద్రలోనే ఆమె కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంత మంది వ్యక్తులు సదరు మహిళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరుతూ గో ఫండ్ మీ‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బ్రిటన్‌(United Kingdom)కు చెందిన హెలెన్ రోడ్స్ (Helen Rhodes).. గత 15 సంవత్సరాలుగా తన పిల్లలు భర్తతో కలిసి హాంగ్ కాంగ్‌ (Hong Kong) లో నివసిస్తోంది. తాజాగా హెలెన్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరిగి బ్రిటన్‌కు వచ్చి.. అక్కడే నివసించాలని భావించారు. ఈ క్రమంలోనే 15 సంవత్సరాల తర్వాత ఆగస్ట్ 5న పిల్లలతో కలిసి తిరిగి ఫ్లైట్‌లో బ్రిటన్‌కు బయల్దేరారు. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు పిల్లలతో కబుర్లు చెప్పి.. ఆనందంగా గడిపిన ఆమె.. నిద్రలోకి జారుకుంది. అనంతరం నిద్రలోనే ప్రాణాలు వదిలింది. గంటలు గడిచినా.. హెలెన్ నిద్ర లేవకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె మరణించిందని గ్రహించి.. శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం విమాన సిబ్బందికి తెలియడంతో.. తొలుత మృతదేహాన్ని ప్రయాణికుల మధ్య నుంచి బయటకు తరలించారు. అనంతరం నిబంధనల ప్రకారం డెడ్ బాడీని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. 


ఈ క్రమంలో కొంత మంది వ్యక్తులు ‘Go Fund Me’ పేజీలో విషయాన్ని వివరించారు. హెలెన్ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థులను చెప్పి, సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు వారికి తోచినంతలో విరాళాలు అందిస్తున్నారు. 

Updated Date - 2022-08-10T22:36:43+05:30 IST