నవీన్ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం

ABN , First Publish Date - 2022-03-06T17:16:15+05:30 IST

ఉక్రెయిన్‌లో రష్యాదళాల మిసైల్‌ దాడిలో మృతిచెందిన వైద్య విద్యార్థి నవీన్‌ గ్యానగౌడర్‌ నివాసాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శనివారం సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాణి బెన్నూరు తాలూకా

నవీన్ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం

                     - రూ.25 లక్షల పరిహార చెక్కు అందజేత


బెంగళూరు: ఉక్రెయిన్‌లో రష్యాదళాల మిసైల్‌ దాడిలో మృతిచెందిన వైద్య విద్యార్థి నవీన్‌ గ్యానగౌడర్‌ నివాసాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శనివారం సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాణి బెన్నూరు తాలూకా చళగేరిలోని నవీన్‌ తండ్రి శేఖర్‌గౌడ గ్యానగౌడర్‌కు ప్రభుత్వం తరపున రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఉక్రెయిన్‌ నుంచి నవీన్‌ మృతదేహాన్ని తెప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సీఎం వెంట వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌, ఎంపీ శివకుమార్‌ ఉదాసి, హరిహర వీరశైవ లింగాయత పంచమసాలి జగద్గురు పీఠాధిపతి వచనానంద స్వామిజీ తదితరులున్నారు. తమ ఇంటికి వచ్చిన సీఎంను చూడగానే నవీన్‌ తల్లిదండ్రులు భోరున విలపించారు. కనీసం తమ కుమారుడి కడపటి చూపుకైనా అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు.

Updated Date - 2022-03-06T17:16:15+05:30 IST