రష్యా, బెలారస్‌కు కారిడార్ల ప్రతిపాదనను తోసిపుచ్చిన ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-03-08T00:11:04+05:30 IST

దిగ్బంధంలో ఉన్న ఉక్రెయిన్ నుంచి పౌరులు రష్యా, బెలారస్‌కు తరలి వెళ్లేందుకు వీలుగా..

రష్యా, బెలారస్‌కు కారిడార్ల ప్రతిపాదనను తోసిపుచ్చిన ఉక్రెయిన్

కీవ్: దిగ్బంధంలో ఉన్న ఉక్రెయిన్ నుంచి పౌరులు రష్యా, బెలారస్‌కు తరలి వెళ్లేందుకు వీలుగా 'మానవతా కారిడార్లు' ఏర్పాటు చేయాలని రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ నిర్దంద్వంగా తోసిపుచ్చింది. ఇది ఎంత మాత్ర ఆమోదయోగ్యం కాని ఆప్షన్ అని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్‌చుక్  అన్నారు. ఉక్రెయిన్‌పై ఫ్రాన్స్, చైనా, టర్కీ, ఇండియా నాయకులకు ఉన్న నమ్మకాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలను రష్యా ఫెడరేషన్ మానుకోవాలని వ్యాఖ్యానించారు.


రష్యా ప్రతిపాదన ప్రకారం, కీవ్ నుంచి పౌరులు తరలి పోయేందుకు ఉన్న ఏకైక మార్గం పొరుగు దేశమైన బెలారస్‌లోని గోమెల్ చేరుకోవడమే. ఖార్కివ్, సుమీలోని ఉక్రెయిన్ పౌరులు రష్యా సిటీ బెల్‌గోరొద్‌కు తరలిపోవచ్చు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌కు బెలారస్ మద్దతుగా నిలుస్తుండగా, బెలారస్‌ను తమ దాడులకు వేదికగా పుతిన్ చేసుకున్నారు. కాగా, ఉక్రెయిన్ ప్రభుత్వం ఎనిమిది 'హ్యూమనిటేరియన్ కారిడార్లు'కు ప్రతిపాదన చేస్తోంది. రష్యా బాంబింగ్ చోటుచేసుకోని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు పౌరులు తరలి వెళ్లేందుకు ఈ కారిడార్లు వీలు కల్పిస్తాయి.

Updated Date - 2022-03-08T00:11:04+05:30 IST