12,000 మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-03-09T20:56:42+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడి పదమూడో రోజుకు చేరింది. అయితే, ఇప్పటివరకు రష్యా దళాలపై జరిపిన ఎదురుదాడిలో దాదాపు 12,000 మందికిపైగా రష్యన్ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

12,000 మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి పద్నాలుగో రోజుకు చేరింది. అయితే, ఇప్పటివరకు రష్యా దళాలపై జరిపిన ఎదురుదాడిలో దాదాపు 12,000 మందికిపైగా రష్యన్ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ప్రకారం... ఉక్రెయిన్ ఎదురుదాడుల్లో దాదాపు పన్నెండు వేల మంది రష్యన్ సైనికులు మరణించారు. అలాగే రష్యాకు చెందిన 48 విమానాలు, 80 హెలికాప్టర్లు, 303 యుద్ధ ట్యాంకులు, 1,036 ఆర్మీ వాహనాలు, 27 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్ సిస్టమ్స్‌ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ రోజు ఉక్రెయిన్‌‌లోని సెవెరోడోనెస్క్‌పై రష్యా జరిపిన దాడిలో పదిమంది పౌరులు మరణించారు. మరోవైపు తమ పౌరులతోపాటు, విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. మరియుపోల్‌తోపాటు మరిన్ని నగరాల నుంచి ఆరు మానవతా కారిడార్‌లు ఏర్పాటు చేసి పౌరులను తరలిస్తోంది.

Updated Date - 2022-03-09T20:56:42+05:30 IST