ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ నుంచి Fighter Jets

ABN , First Publish Date - 2022-02-28T13:48:03+05:30 IST

రష్యా సైనిక దాడుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ దేశానికి ఫైటర్ జెట్‌లను పంపించాలని నిర్ణయించింది...

ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ నుంచి Fighter Jets

బ్రస్సెల్స్ (బెల్జియం): రష్యా సైనిక దాడుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ దేశానికి ఫైటర్ జెట్‌లను పంపించాలని నిర్ణయించింది.రష్యా వైమానిక , భూ దాడులను ఎదుర్కోవడంలో సహాయపడటానికి కైవ్ అభ్యర్థన మేరకు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్‌లను పంపుతాయని కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు.‘‘మేం ఫైటింగ్ జెట్‌లను కూడా అందించబోతున్నాము.యుద్ధానికి వెళ్లడానికి మేం ముఖ్యమైన ఆయుధాలను ఉక్రెయిన్ దేశానికి అందిస్తున్నాం’’ అని జోసెప్ బోరెల్ విలేకరుల సమావేశంలో చెప్పారు.


తమకు ఫైటింగ్ జెట్ విమానాలు కావాలని ఉక్రేనియన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా యూరోపియన్ యూనియన్‌ని అభ్యర్థించారు.ఉక్రేనియన్ సైన్యం ఆపరేట్ చేయగల ఫైటింగ్ జెట్‌లు కావాలని కోరిందని, దీంతో కొన్ని సభ్య దేశాల వద్ద ఈ రకమైన విమానాలు ఉన్నాయని, వీటిని ఉక్రెయిన్ దేశానికి పంపిస్తామని బోరెల్ చెప్పారు. 


Updated Date - 2022-02-28T13:48:03+05:30 IST