మహిళల అండర్‌వేర్‌లను వేలం వేసిన ప్రభుత్వం.. సోషల్ మీడియాలో కలకలం!

ABN , First Publish Date - 2021-03-06T23:49:32+05:30 IST

అవును.. నమ్మశక్యంగా లేనప్పటికీ మీరు చదువుతున్నది నిజం..! యూక్రెయిన్ దేశపు న్యాయా శాఖ ఇటీవల మహిళల లోదుస్తులను అమ్మకానికి పెట్టింది. వేలంలో పాల్గొని వాటిని కొనుక్కోవాలంటూ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆ దుస్తులు ఫోటోలు కూడా అప్‌లోడ్ చేసింది. ఈ కథనం తొలుత వార్తల్లోకెక్కి.. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోయింది.

మహిళల అండర్‌వేర్‌లను వేలం వేసిన ప్రభుత్వం.. సోషల్ మీడియాలో కలకలం!

ఇంటర్నెట్ డెస్క్: అవును.. నమ్మశక్యంగా లేనప్పటికీ మీరు చదువుతున్నది నిజం..! యూక్రెయిన్ దేశపు  న్యాయా శాఖ ఇటీవల మహిళల లోదుస్తులను అమ్మకానికి పెట్టింది. వేలంలో పాల్గొని వాటిని కొనుక్కోవాలంటూ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆ దుస్తుల ఫోటోలు కూడా అప్‌లోడ్ చేసింది. ఈ కథనం తొలుత వార్తల్లోకెక్కి.. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఈ వేలం గురించి తెలిసిన వారందరూ నోరెళ్లబెడుతున్నారు. కొందరు మాత్రం న్యాయా శాఖ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎంతకీ సద్దుమణగకపోవడంతో  అక్కడి అధికారులు స్వయంగా రంగంలోకి దిగి.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు. 


వారు చెప్పిన దాని ప్రకారం.. అక్కడి వీధి వ్యాపారి ఒకరు ప్రభుత్వానుమతి లేకుండా వీధిలో వ్యాపారం ప్రారంభించాడట. దీంతో..అధికారులు అతడి వస్తువులను జప్తు చేశారు. అదిగో..అలా ఈ లోదుస్తులు ప్రభుత్వం వద్దకు చేరాయి. ఇక చట్టప్రకారం.. జప్తు చేసిన వస్తువులను వేలం వేసి తనకు రావల్సిన మొత్తాన్ని రాబట్టుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. దీంతో..న్యాయశాఖ వీటిని వేలానికి పెట్టింది. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే ఇలా చేయాల్సి వచ్చిందని కూడా వివరించింది.  ఈ వివరణతో నెటిజన్ల ఆగ్రహం కొంత మేర చల్లారినప్పటికీ..ఈ మొత్తం వ్యవహారం ఓ కామెడీ ఎపిసోడ్‌గా మారి సోషల్ మీడియాలో నవ్వులు పూచించింది. 

Updated Date - 2021-03-06T23:49:32+05:30 IST