Russian forces దాడులతో మారియుపోల్ నగరంలో మంచినీరు,విద్యుత్ సరఫరాకు బ్రేక్

ABN , First Publish Date - 2022-03-04T18:24:47+05:30 IST

రష్యా సైనికుల దాడితో ఉక్రెయిన్ దేశంలోని మారియుపోల్ నగరం అట్టుడికి పోతోంది....

Russian forces దాడులతో మారియుపోల్ నగరంలో మంచినీరు,విద్యుత్ సరఫరాకు బ్రేక్

మారియుపోల్ (ఉక్రెయిన్): రష్యా సైనికుల దాడితో ఉక్రెయిన్ దేశంలోని మారియుపోల్ నగరం అట్టుడికి పోతోంది. రష్యా దళాలు ప్రజలపై కనికరం లేకుండా దాడులు చేస్తోంది. దీంతో మారియుపోల్ నగరంలో ప్రజలకు మంచినీరు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు నిలిచిపోయాయి.దీంతో మారియుపోల్ ప్రజలు అల్లాడుతున్నారు. మాస్కో సైనిక దళాలు మారియుపోల్ నగరాన్ని చుట్టుముట్టి మంచినీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేశాయి. ఉక్రేనియన్ ఓడరేవు నగరమైన మారియుపోల్ నగరాన్ని దిగ్బంధించిన రష్యా సైనికులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.మారియుపోల్ నగరంలో రష్యా సేనలు గత 24 గంటలుగా భీకర దాడులు చేస్తున్నాయని మేయర్ వాడిమ్ బోయిచెంకో చెప్పారు.రష్యా దాడితో మారియుపోల్ నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ అంతరాయం కారణంగా కనీసం ఫోన్లు కూడా పనిచేయడం లేదని పౌరులు ఆవేదనతో చెప్పారు.  


Updated Date - 2022-03-04T18:24:47+05:30 IST