ఆయుధాలు చేతబట్టి కదన రంగంలోకి దిగిన Ukrainian పౌరులు

ABN , First Publish Date - 2022-03-03T16:46:25+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనికదాడి నేపథ్యంలో పౌరులే సైనికులుగా మారారు....

ఆయుధాలు చేతబట్టి కదన రంగంలోకి దిగిన Ukrainian పౌరులు

కైవ్ : ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనికదాడి నేపథ్యంలో పౌరులే సైనికులుగా మారారు. తమ దేశాన్ని రష్యా దాడి బారి నుంచి కాపాడుకునేందుకు ఉక్రెయిన్ యువతీ,యువకులు ముందుకు వచ్చి తుపాకులు చేతబట్టి కదనరంగంలో దూకారు. రష్యా దండయాత్రను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ యువతీయువకులు, నూతన వధూవరులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. యువతులు సైతం తుపాకులు కాల్చడం నేర్చుకొని యుద్ధరంగంలోకి దిగారు. తుపాకులతో కాల్చడం, గ్రెనెడ్లు విసరడంలో ఉక్రెనియన్ పౌరులు శిక్షణ తీసుకున్నారు. 


ఉక్రెయిన్ పౌరులు పౌర రక్షణ దళాలుగా ఏర్పడి చెక్ పోస్టులు, వీధుల్లో ఉండి గస్తీ నిర్వహించారు.వాలంటీర్ సైనికులుగా మారిన ఉక్రెయిన్ పౌరులు తుపాకులతో నగరాల్లో పహరా కాశారు.



రష్యా దాడి నేపథ్యంలో ఖార్కివ్ షూటింగ్ రేంజ్ లో కలాష్నికోవ్ రైఫిల్ తో కాల్పులు జరపడంలో శిక్షణ పొందారు.నూతన దంపతులు సైతం రెండు తుపాకులు చేతబట్టి ఉక్రెయిన్ రక్షణ కోసం తాము సైతం అంటూ ముందుకు వచ్చారు.పలువురు ఉక్రెనియన్ పౌరులు బాటిళ్లలో పెట్రోలు బాంబులు సిద్ధం చేసి రష్యా సైనికులపై దాడికి సమాయత్తమయ్యారు.

Updated Date - 2022-03-03T16:46:25+05:30 IST