Global food crisis : ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి సగానికి తగ్గుతుంది : జెలెన్‌స్కీ

ABN , First Publish Date - 2022-07-31T21:35:38+05:30 IST

రష్యా (Russia) యుద్ధం ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్రంగా

Global food crisis : ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి సగానికి తగ్గుతుంది : జెలెన్‌స్కీ

కీవ్ : రష్యా (Russia) యుద్ధం ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్రంగా పడుతుందని ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) చెప్పారు. ఆహార పంటల ద్వారా సాధారణ పరిస్థితుల్లో దిగుబడి అయ్యే దానిలో దాదాపు సగం మాత్రమే ఈ ఏడాది చేతికి అందుతుందని ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపారు.  


రష్యా యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఆహార సంక్షోభాన్ని (Global Food Crisis) నివారించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆహార ధాన్యాలను అందజేయడానికి ప్రత్యామ్నాయ మార్గం దొరికిందని తెలిపారు. 


ఉక్రెయిన్ ప్రపంచంలోని చాలా దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది. రష్యా నావికా దళం ఉక్రెయిన్ నల్ల సముద్రపు నౌకాశ్రయాలను దిగ్బంధించింది. కాబట్టి ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు ఆహార ధాన్యాల రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. ఆహార ధాన్యాలను రవాణా చేసే నౌకలను సురక్షితంగా పంపించేందుకు ఓ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని మూడు పోర్టుల నుంచి ఆహార ధాన్యాల రవాణాకు అంగీకరిస్తూ జూలై 22న ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్ మంత్రి ఒకరు మాట్లాడుతూ, ఈ వారాంతంలో ఆహార ధాన్యాలతో మొదటి నౌక బయల్దేరే అవకాశం ఉందని చెప్పారు. 


Updated Date - 2022-07-31T21:35:38+05:30 IST