యుద్ధం చేస్తూనే గాళ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్.. వైరల్ అవుతున్న జవాన్ వీడియో.. ఇలా చేస్తే ఆమె మాత్రం ఎలా కాదంటుంది!

ABN , First Publish Date - 2022-03-11T14:28:39+05:30 IST

దేశం కోసం పోరాడుతూనే తన గాళ్‌ఫ్రెండ్‌కు ఓ సైనికుడు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. శత్రువులు తన దేశంలోకి చొచ్చుకు రాకుండా పహారా కాస్తూనే.. ఇష్టమైన అమ్మాయికి ప్రపోజ్ చేసేశాడు. ప్రస్తుతం ఇందుకు సం

యుద్ధం చేస్తూనే గాళ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్.. వైరల్ అవుతున్న జవాన్ వీడియో.. ఇలా చేస్తే ఆమె మాత్రం ఎలా కాదంటుంది!

ఇంటర్నెట్ డెస్క్: దేశం కోసం పోరాడుతూనే తన గాళ్‌ఫ్రెండ్‌కు ఓ సైనికుడు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. శత్రువులు తన దేశంలోకి చొచ్చుకు రాకుండా పహారా కాస్తూనే.. ఇష్టమైన అమ్మాయికి ప్రపోజ్ చేసేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఏవేవో కారణాలు చెప్పి కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు దానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఉక్రెయిన్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. రష్యా సేనలకు ధీటుగా జవాబు ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా.. రష్యాతో యుద్ధంలో చేస్తూనే ఓ సైనికుడు తన గాళ్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేశాడు. రష్యా సేనలు దేశంలోకి చొచ్చుకు రాకుండా పహారా కాస్తూనే ప్రియురాలి ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఓ చేతిలో ఉంగరం, మరో చేతిలో పూలు పట్టుకుని మొకాళ్లపై కూర్చుని మరీ ఆమెపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. దీంతో ఆ యువతి ఫిదా అయింది. ఆ సైనికుడిని గట్టిగా హత్తుకుని అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పక్కనే ఉన్న మరికొందరు సైనికులు తమ ఫోన్‌లలో బంధించారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింటికి చేరడంతో అదికాస్తా వైరల్ అయింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ జంటకు కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 






Updated Date - 2022-03-11T14:28:39+05:30 IST