Rudi Koertzen: రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ రూడీ కోయెర్ట్‌జెన్ కన్నుమూత.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సెహ్వాగ్

ABN , First Publish Date - 2022-08-10T00:28:47+05:30 IST

దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ అంపైర్ రూడీ కోయెర్ట్‌జెన్ (Rudi Koertzen) కన్నుమూశారు. రివర్‌సేల్ సమీపంలో

Rudi Koertzen: రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ రూడీ కోయెర్ట్‌జెన్ కన్నుమూత.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సెహ్వాగ్

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ అంపైర్ రూడీ కోయెర్ట్‌జెన్ (Rudi Koertzen) కన్నుమూశారు. రివర్‌సేల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రూడీ సహా నలుగురు మరణించారు. రూడీ కుమారుడు రూడీ కొయెర్ట్‌జన్ జూనియర్ నిర్ధారించారు. స్నేహితులతో కలిసి గోల్ఫ్ టోర్నీకి వెళ్లారని, సోమవారం తిరిగి వస్తారని భావించామని అన్నారు. కానీ వారు మరో రౌండ్ గోల్ఫ్ ఆడాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అది ముగిశాక కేప్‌టౌన్ నుంచి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రూడీ ప్రాణాలు కోల్పోయారు. 


రూడీ మరణవార్త గురించి తెలిసిన వెంటనే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) స్పందించాడు. లెజండరీ అంపైర్‌కు నివాళులు అర్పించాడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపాడు. ఆయనతో తనకు గొప్ప అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నాడు. తానెప్పుడైనా ర్యాష్ షాట్ ఆడినప్పుడు తనను కోప్పడేవారని, తెలివిగా ఆడాలని హెచ్చరించేవారని పేర్కొన్నాడు. తన బ్యాటింగును చూడాలని అనుకుంటున్నానని అన్నారని గుర్తు చేసుకున్నాడు. ఆయన చాలా మంచి, గొప్ప వ్యక్తని కొనియాడాడు.


రూడీ 1997లో తొలిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంపైర్‌గా నియమితులయ్యారు. స్టీవ్ బక్నర్ తర్వాత 200 వన్డేలు, 100 టెస్టులకు అంపైరింగ్ నిర్వహించిన రెండో అంపైర్‌గా రూడీ రికార్డులకెక్కారు. 2003, 2007 ప్రపంచకప్ ఫైనల్స్‌లో రూడీ థర్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో అంపైరింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్ట్‌లో చివరిసారి అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 

Updated Date - 2022-08-10T00:28:47+05:30 IST