మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూలై 5: ఒక గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతిచెందాడు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ తూర్పు వైపున అపస్మారక స్థితిలో వ్యక్తి పడి ఉన్న వ్యక్తిని గుర్తించిన ప్రజలు 108కు మంగళవారం సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ మృతి చెందాడు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. వారికి ఎలాంటి ఆనవాలు లభించలేదు.