అందుబాటులో లేని యునాని వైద్య సేవలు

ABN , First Publish Date - 2021-01-13T05:21:33+05:30 IST

యునానీ వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆసుపత్రిని ఏర్పాటు చేసింది.

అందుబాటులో లేని యునాని వైద్య సేవలు
మూతపడ్డ యునాని వైద్యశాల

నిజాంసాగర్‌, జనవరి 12: యునానీ వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. కానీ, ఆస్పత్రి సిబ్బంది విధి నిర్వహణకు రాని కారణం గా ఆస్పత్రి మూత పడింది. పురాతన ఆస్పత్రి భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నూతనంగా 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మా ణం చేపట్టిన యునానీ వైద్యశాల ఇప్పటికీ ప్రార ంభానికి నోచుకోవడం లేదు. దీంతో యునానీ వైద్యం కోసం ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నా పాలకులు, అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. నిజాంసాగర్‌ మండలం అచ్చంపే ట గ్రామంలో దాదాపు 50 ఏళ్ల కిందట ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి నీటి పారుదల పురాతన క్వాట ర్లలోనే కొనసాగుతోంది. ఈ ఆస్పత్రి నిర్వహణకు డాక్టర్‌, కాం పౌండర్‌, స్వీపర్లు విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డుల్లో వారి పేర్లు నమోదు అయ్యాయని సమాచారం. ఆస్పత్రి తెరుచుకో లేక పోవడంతో ఆస్పత్రిలో ఉన్న మందులు తుప్పు పట్టి పోతూ నే ఉన్నాయి. ఈ ఆస్పత్రిని తెరిచే నాథుడు లేకపోవడంతో రోగులు నిత్యం ఆస్పత్రిని చూసి వెనుదిరిగిపోతున్నారు. శిథిలా వస్థకు చేరిన ఆస్పత్రిని మండల కేంద్రానికి తరలించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నాలుగేళ్ల కిందట 3 లక్షల రూపాయల వ్యయంతో యునానీ వైద్యశాలను నిర్మించారు. కానీ, ఈ భవ నాన్ని ప్రారంభించి ఆస్పత్రిని మండల కేంద్రానికి తరలించాల నే ఆలోచన పాలకులు, అధికారులకు లేకపోవడం పట్ల సర్వ త్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నూతనంగా నిర్మించిన ఆస్పత్రి ప్రారంభానికి నోచుకోలేక పోవడంతో నిరుపయోగంగా నే దర్శనమిస్తోంది. ఇప్పటికైనా పాలకులు, అధికార యంత్రా ంగం స్పందించి నిరుపయోగంగా ఉన్న ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించి, మూడపడ్డ ఆస్పత్రిని నూతన భవనంలోకి మార్చి ప్రజలకు వైద్యసేవలు అందేట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-01-13T05:21:33+05:30 IST