అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-01-22T05:11:16+05:30 IST

అనధికా లేఅవుట్లపై నగర పంచాయతీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం
అనధికార లేఅవుట్‌లలో హద్దురాళ్లను తొలగిస్తున్న నగర పంచాయతీ అధికారులు

అద్దంకిలో 50కి పైగా వెంచర్లు

క్రమబద్ధీకరణకు పలువురు విముఖత

హద్దు రాళ్లను తొలగిస్తున్న నగర పంచాయతీ అధికారులు

ఆందోళనలో కొనుగోలుదారులు

అద్దంకి, జనవరి 21: అనధికా లేఅవుట్లపై నగర పంచాయతీ ప్రత్యేక దృష్టి పెట్టింది.  వీటి హద్దురాళ్ల ను తొలగిస్తున్నారు.  సుమారు 15 సంవత్సరాలుగా అద్దంకిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగు తూ పెద్ద ఎత్తున వెంచర్‌లు వేశారు. ఇంతవరకు అ ద్దంకి పట్టణంలో నిబంధనలు పాటిస్తూ అన్ని అను మతులతో వేసిన ప్లాట్లు ఒక్కటి లేదంటే ఆశ్చర్యం కలుగక తప్పదు. 

50కి పైగా లేఅవుట్లు

పట్టణంలో సుమారు 50కిపైగా లేఅవుట్లలో వెంచ ర్‌లు వేసి రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారాలు సాగించారు.  అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ద్వారా గత నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు.  గడువు ముగిసినా 19 లేఅవుట్‌లకు సం బంధించి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలి న వారు అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదు.  దీ న్నిబట్టి వ్యాపారులు ఇప్పటికే అన్ని ప్లాట్లనూ అమ్మే సినట్లు స్పష్టమవుతుంది. ఈనేపథ్యంలో అద్దంకి నగర పంచాయతీ టౌన్‌ప్లానింగ్‌ అధికారి వెంకటేశ్వరరెడ్డి, టీపీఎస్‌ నారాయణరావు ఆధ్వర్యంలో అనధికారిక లే అవుట్లలో ఉన్న వెంచర్‌ల ప్లాట్ల హద్దురాళ్లు తొలగిం పునకు శ్రీకారం చుట్టారు. దీంతో స్థలాల కొనుగోలు దారులలో ఆందోళన ప్రారంభమైంది. 


నిబంధనలు బేఖాతర్‌

ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి లేఅవుట్‌లో 40 అడుగుల వెడల్పుతో ప్రధాన రహ దారి ఉండాలి. అదే సమయంలో పది శాతం స్థలం పార్కుకు వద లాలి.  ఇప్పటివరకు  అద్దంకిలో వే సిన ఏ వెంచర్‌లోనూ 40 అడుగు ల వెడల్పుతో రోడ్డు లేదు. అత్యధి క శాతం 20 అడుగులు, 15 అడుగుల వెడల్పు రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల రెండు మూడు వెంచర్ల లో మాత్రం 30 అడుగులను రోడ్డుకు కేటాయించారు. కొన్ని వెంచర్లలో ప్లాట్లు కొను గోలు చేసుకున్న వారు నిర్మాణాలకు సిద్ధం కాగా, ప్లా న్‌ అప్రూవల్‌ రావడం లేదు.  సెంట్‌ ధర రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసినా చివరకు నగర పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవని తెలిసి కొనుగోలుదారులు లబోదిబోమంటు న్నారు. ఇటీవల నాగులపాడు రోడ్డులో ఎక్కువ విస్తీర్ణంలో ఓ వెంచర్‌ వేసినా అందులో కూడా నిబంధనల మేరకు 40 అడుగుల రోడ్డు లేదు. దీంతో కొనుగోలుదారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. 


హద్దు రాళ్ల తొలగింపు

నగరపంచాయతీ అధికారులు ఇప్పటికే 19 అనధి కార లేఅవుట్లలో ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు.  మిగిలిన అనధికార లేఅవుట్‌లలో కూడా రెపోమాపో హద్దురాళ్లను తొలగిస్తారు. ఈక్రమంలో లక్షల రూపా యలు వెచ్చించిన కొనుగోలుదారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను నిలదీస్తున్నారు. దీంతో పలువురు దళా రులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ముఖం చాటేసి తిరుగుతున్నారు. అనధికారిక లేఅవుట్‌లో హద్దు రాళ్ల తొలగింపు పూర్తి స్థాయిలో జరుగుతుందా లేక అధి కారుల దూకుడుకు కళ్లెం పడుతుందా అన్న అనుమా నాలు ఉన్నాయి. 


అనధికార లేఅవుట్లను తొలగిస్తాం

- వెంకటేశ్వరరెడ్డి, టీపీవో, అద్దంకి నగర పంచాయతీ 

అద్దంకి పట్టణ పరిధిలో ఇప్పటి వరకు 19 అనధి కార లేఅవుట్‌లను గుర్తించాం. నిబంధనలకు విరుద్ధం గా ఉండడంతో హద్దు రాళ్లను తొలగిస్తాం. నిబంధనల మేరకు 40 అడుగుల వెడల్పుతో ప్రధాన  రోడ్డు, పది శాతం స్థలం పార్కుకు నగరపపంచాయతీకి అప్పగించాలి. అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ నిలిపివేస్తున్నాం. ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే స్థల యజమానులు కచ్చితంగా నిబంధనలు పాటించి ఇంటి నిర్మాణం చేసుకోవాలి. మిగతాచోట్ల అనధికార వెంచర్‌లు తొలగిస్తాం. అనుమతి పొందిన వెం చర్లలో మాత్రమే ప్లాట్లను కొనుగోలు చేయాలి. 

Updated Date - 2021-01-22T05:11:16+05:30 IST