అనుమతి లేని క్లినిక్స్‌ సీజ్‌

ABN , First Publish Date - 2022-07-02T05:37:20+05:30 IST

అనుమతి లేని క్లినిక్స్‌ సీజ్‌

అనుమతి లేని క్లినిక్స్‌ సీజ్‌
నిర్వాహకులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

విజయనగరం రింగురోడ్డు: అనుమతి లేని క్లినిక్స్‌ను డీఎం హెచ్‌వో ఎస్‌వీ రమణ కుమారి సీజ్‌ చేశారు. ఈ క్లినిక్స్‌పై వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం సిబ్బంది కలిసి డీఎంహెచ్‌వో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలో రిజిస్ట్రేషన్‌ అనుమతులు లేని సిందూరాస్‌ ఐ క్లీనిక్‌, శంకర్‌ ఐ ఆసుపత్రి (విజన్‌ సెంటర్‌)లను తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, ఫిజియోథెరపీ సెంటర్లు, డెంటల్‌ క్లీనిక్‌లు, లేబ్‌లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి, అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-07-02T05:37:20+05:30 IST