అనిశ్చితి కొనసాగింపు -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-04-19T06:07:40+05:30 IST

నిఫ్టీ రియాక్షన్‌తో ప్రారంభమై తదుపరి కోలుకున్నా చివరికి 220 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది. వీక్లీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ వారం గరిష్ఠ స్థాయిలో క్లోజయింది...

అనిశ్చితి కొనసాగింపు  -టెక్‌ వ్యూ

నిఫ్టీ రియాక్షన్‌తో ప్రారంభమై తదుపరి కోలుకున్నా చివరికి 220 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది. వీక్లీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ వారం గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. ఇది పాజిటివ్‌ ట్రెండ్‌ సంకేతం. కాని మార్కెట్‌ ఇప్పటికీ నిరోధ స్థాయిలకు దిగువనే ఉంది. ట్రెండ్‌ పరిస్థితిలో మార్పేమీ లేదు. కొత్త ట్రెండ్‌ను నిర్ధారించడానికి బ్రేకౌట్‌ కోసం ఎదురు చూస్తోంది. మొత్తం మీద గత మూడు నెలల సైడ్‌వేస్‌, ఆటుపోట్ల ధోరణి టెక్నికల్‌గా కొనసాగుతోంది. కేవలం 1500 పాయింట్ల పరిధిలోనే కదలాడుతోంది. ప్రధాన దిశ తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. సానుకూల ట్రెండ్‌ కోసం కనిష్ఠ స్థాయిల్లో పునరుజ్జీవం తప్పనిసరి. రాబోయే రోజుల్లో మైనర్‌ అప్‌ట్రెండ్‌, మరింత కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. 


బుల్లిష్‌ స్థాయిలు: తదుపరి నిరోధ స్థాయి 14850. స్వల్పకాలిక ప్రధాన నిరోధ స్థాయి 15000. మరింత అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే 15000 పైన నిలదొక్కుకోవాలి. అప్పుడే భద్రత సంకేతం కూడా ఇస్తుంది.

బేరిష్‌ స్థాయిలు: మద్దతు స్థాయి 14400. స్వల్పకాలిక, మధ్యకాలిక మద్దతు స్థాయి 14000. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్‌కు ఆస్కారం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ 1700 పాయింట్ల బలమైన రియాక్షన్‌లో వారాన్ని ప్రారంభించినా 1500 పాయింట్ల మేరకు రికవరీ సాధించింది. కాని చివరికి గత వారంతో పోల్చితే 470 పాయింట్ల నష్టంతో క్లోజయింది. అయినా వారం గరిష్ఠ స్థాయిల్లో ముగియడం కొనుగోళ్ల మద్దతు లభిస్తోందని సూచిస్తోంది. ప్రధాన నిరోధం 32500. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్‌లో ప్రవేశిస్తుంది.

పాటర్న్‌: మార్కెట్‌ ఇప్పటికీ 50, 100 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. ఈ స్థాయిల కన్నా పైన కనీసం రెండు రోజుల పాటు నిలదొక్కుకోవాలి. మరింత స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 15000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన  రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ను బ్రేక్‌ చేయాలి. నిఫ్టీ ‘‘ఏటవాలుగా దిగువకు ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉండడం సానుకూల సంకేతం.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్‌ ఉంది.



సోమవారం 

స్థాయిలు


నిరోధం : 14680, 14740 

మద్దతు : 14560, 14500


Updated Date - 2021-04-19T06:07:40+05:30 IST