సోదరుడితో ఆడుకుంటూ 8ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా అదృశ్యం.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు వెలుగులోకి.. సొంతవాళ్లే..

ABN , First Publish Date - 2022-04-08T22:01:50+05:30 IST

అతడికి ఎనిమిదేళ్లు. అప్పటి వరకూ తమ్ముడితో కలిసి ఇంటి పక్కనే ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అదృశ్యం అయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అర్ధరాత్రి వరకూ ఆ చిన్నారి కోసం ఊరం

సోదరుడితో ఆడుకుంటూ 8ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా అదృశ్యం.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు వెలుగులోకి.. సొంతవాళ్లే..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ఎనిమిదేళ్లు. అప్పటి వరకూ తమ్ముడితో కలిసి ఇంటి పక్కనే ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అదృశ్యం అయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అర్ధరాత్రి వరకూ ఆ చిన్నారి కోసం ఊరంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో.. మరుసటి రోజు కూడా చుట్టు పక్కల ఉళ్లను జల్లెడ పట్టారు. అయినా బాబు ఆచూకి లభించలేదు. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అధికారుల దర్యాప్తులో భయంకర నిజాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ ప్రాంతానికి చెందిన సంజయ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. సంజయ్ దంపతులు టింకు(8), లవ్‌కు జన్మనిచ్చారు. ఈ క్రమంలో టింకు ఎప్పటిలాగే మంగళవారం కూడా తన తమ్ముడు లవ్‌తో ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. అయితే సాయంత్రం అయ్యే సరికి లవ్ ఇంటికి చేరుకున్నాడు. కానీ టింకు మాత్రం రాలేదు. దీంతో సంజయ్ దంపుతులు టింకు కోసం వెతకడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి అయినా ఆ చిన్నోడి జాడ వారికి తెలియలేదు. బుధవరాం కూడా తమ కొడుకు కోసం చుట్టుపక్కల ప్రాంతాలను గాలించారు. మళ్లీ వారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించారు. సంజయ్ దంపతుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తు వేగవంతం చేశారు. 



ఈ నేపథ్యంలో ఊరి పక్కన ఉన్న చెరుకుతోటలో బాలుడి మృతదేహం లభించింది. దీంతో  అధికారులు ఆ చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. అనంతరం సంజయ్ కుటుంబ సభ్యులను విచారించారు. ఈ క్రమంలో భయంకర నిజాలు బయటికొచ్చాయి. బాలుడి మేనమామ మదన్, మేనత్త పింకీ తమ తప్పు ఒప్పుకున్నారు. పెళ్లై మూడేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో.. నరబలి ఇచ్చేందుకు టింకును కిడ్నాప్ చేసినట్టు వెల్లడించారు. ఇందుకోసం కొందరికి రూ.2లక్షలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు మదన్, పింకీలతో పాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ఐదురుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 




Updated Date - 2022-04-08T22:01:50+05:30 IST