‘గురుకులం’లో అపరిశుభ్రత

ABN , First Publish Date - 2021-12-05T05:26:29+05:30 IST

మండ లంలోని నాగులపాలెం బాలయోగి గురుకుల పాఠశా లలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.

‘గురుకులం’లో అపరిశుభ్రత
ఫ్రిన్సిపాల్‌ మేరీకళను ప్రశ్నిస్తున్న న్యాయమూర్తి కుముదిని

 అధ్వానంగా పారిశుధ్యం

 అమలుకాని మెనూ

 పాఠశాలను తనిఖీచేసిన న్యాయమూర్తి

 సిబ్బందిపై ఆగ్రహం        

నాగులపాలెం(పర్చూరు), డిసెంబరు 4:  మండ లంలోని నాగులపాలెం బాలయోగి గురుకుల పాఠశా లలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ప్రాంగణం  చెత్తాచెదారంతో నిండిపోయింది.  భోజనశాల మరిం త దయనీయంగా ఉంది. రోజలు తరబడి చెత్తాచెదా రం పేరుకుపోవటంతో దుర్గంధం వెదజల్లుతోం ది. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లోనే త యారుచేసిన భోజనాన్ని విద్యార్థులను అందిస్తున్నారు.  గురుకులం దుస్థితి పై న్యాయసేవాధికార సంస్ధకు అందిన ఫిర్యా దు మేరకు శనివారం సీ నియర్‌ సివిల్‌ జడ్జి, మం డల న్యాయ సేవాధికార సంస్ధ ఛైర్మన్‌ జి.కుముదిని ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠ శాలలో పలురికార్డులు పరిశీ లిం చారు. ఎంతమంది విద్యార్థులు, సి బ్బంది ఉన్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాల యం లో అన్ని విభా గాలను తనిఖీచే శారు. అ పరిశు భ్రంగా విద్యాలయం ఉండ టంపై ప్రిన్సిపాల్‌ మేరీకళపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. భోజనశాలలో కూడా పరిశురఽభత లేదు. అపరి శుభ్రంగా ఉన్న ప్రాంగణంలోనే విద్యా ర్ధులు భోజనం చేస్తున్నారు. ఇలా అయితే అం టువ్యాధులు రావా అని ప్రశ్నించారు. ప్రాంగణంతో పాటు తరగతి గదుల్లో కూడా వాతావరణం అపరి శుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. తద నంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీ లించారు. ముద్దగా, ఎర్రగా మారిన భోజనాన్ని పరిశీ లించి ఇదేనా మీరు విద్యార్థులకు అందిస్తుంది అని  ప్రశ్నించారు. ప్రభుత్వం అందిస్తుంది ఇదే బియ్యం అంటూ సిబ్బంది సమాదానం ఇచ్చారు. మెనూ ప్రకా రం భోజనం అందించకపోవటంపై న్యాయమూర్తి ఆ గ్రహం వ్యక్తం చేశారు. 

బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో విద్యా ర్థినులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్వహణ, అప రిశుభ్ర వాతావరణంపై జిల్లా సోషల్‌ వేల్ఫేర్‌ అధికా రులకు నోటీసులు జారీచేస్తామని న్యాయమూర్తి కు ముదిని తెలిపారు. 

Updated Date - 2021-12-05T05:26:29+05:30 IST