విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం: ఏఐఎస్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2022-08-13T06:03:45+05:30 IST

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసే ఏకైక సంఘం ఏఐఎ్‌సఎఫ్‌ అని ఏఐఎ్‌సఎఫ్‌ మాజీ రాష్ట్ర నాయకులు మంద పవన్‌ అన్నారు

విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం: ఏఐఎస్‌ఎఫ్‌
చేర్యాలలో యూనియన్‌ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న అందె అశోక్‌

సిద్దిపేట అర్బన్‌/చేర్యాల, ఆగస్టు 12: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసే ఏకైక సంఘం ఏఐఎ్‌సఎఫ్‌ అని ఏఐఎ్‌సఎఫ్‌ మాజీ రాష్ట్ర నాయకులు మంద పవన్‌ అన్నారు.సంఘం  87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్‌ వద్ద జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె కుమార్‌, జిల్లా నాయకులు  తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చేర్యాలలో ఏఐఎ్‌సఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని యూనియన్‌ నాయకులుఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా శుక్రవారం యూనియన్‌ మాజీరాష్ట్ర నాయకుడుఅందె అశోక్‌ యూనియన్‌ పతాకాన్నిఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు పుల్లనివేణు, బోగి మనోహర్‌, ముచ్చాలసుధీర్‌, బోక్కల రాకేశ్‌, కొమ్మురాజుల తిరుపతి, నరేశ్‌,కుమార్‌ తదితరులుపాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T06:03:45+05:30 IST