సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు

ABN , First Publish Date - 2022-08-20T05:18:48+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారం కోజం రాజీలేని పోరాటాలు చేస్తామని అన్నమయ్య జిల్లా సీపీఐ కార్యదర్శి నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు
నూతన కార్యవర్గ సభ్యులతో అన్నమయ్య జిల్లా సీపీఐ కార్యదర్శి నరసింహులు

-రాయచోటిటౌన, ఆగస్టు 19: ప్రజా సమస్యల పరిష్కారం కోజం రాజీలేని పోరాటాలు చేస్తామని అన్నమయ్య జిల్లా సీపీఐ కార్యదర్శి నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్‌ అన్నారు. శుక్రవారం  రాయచోటి పట్టణంలోని ఎన్జీవో హోంలో అన్నమయ్య జిల్లా సీపీఐ  కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కృష్ణప్ప, మనోహర్‌రెడ్డి, సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సాంబశివ, శ్రీనివాసగౌన, విశ్వనాధనాయక్‌, సుధీర్‌, సుమిత్ర, కోటేశ్వరరావు, రాధాకృష్ణ, చిన్నయ్య, మురళి, టీఎల్‌ వెంకటేష్‌లతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ  పెండింగ్‌లో ఉన్న తెలుగు- గంగ, గాలేరు- నగిరి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరం వరదల్లో కొట్టుకుపోయిన అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులను తక్షణమే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ప్రభుత్వ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని, మదనపల్లె లో టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, రైల్వేకోడూరులో జ్యూస్‌ ఫ్యాక్టరీలు, ప్రభుత్వ కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. పీలేరు మార్కెట్‌ యార్డులో సదుపాయాలు మెరుగుపరచ డానికి నిధులు కేటాయించాలని, బీ. కొత్తకోటలో ఆర్టీసీ డిపో తిరిగి ప్రారంభించాలని, రాజంపేటలో ఇండస్ర్టియల్‌ ఏరియా అభివృద్ధి చేయాలని, మదనపల్లెలో తాగునీటి సమస్య పరిష్కారం  కోసం హంద్రీ-నీవాకు సమాంతర కాలువలు తవ్వి చెరువులకు నీళ్లు ఇవ్వాలన్నారు. మదనపల్లె- బెంగుళూరు బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని, రాయచోటిలో మామిడి, టమోటా ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రంగారెడ్డి, వెంకటేష్‌ తదితరులు 

Updated Date - 2022-08-20T05:18:48+05:30 IST