తగ్గని లీకేజి ఉదృతి..

ABN , First Publish Date - 2021-12-05T05:26:06+05:30 IST

మండలంలోని మోపాడు జలాశయం కట్టకు ఏర్పడ్డ లీకుల నుంచిఉబికి వస్తున్న రిజర్వాయర్‌ నీటిని ఇప్పట్లో అడ్డుకట్టపడే పరిస్థితి కానరావడం లేదు. కట్టుకు ఏర్పడిన లీకులను కట్టడి చేసేందుకు ఇరిగేషన్‌శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. లీకుల వద్ద నీటిని అరికట్టేందుకు ఇప్పటి వరకు 5 వేల బస్తాల ఇసుక, కంకర కలిపిన మిశ్రమాన్ని అడ్డుకట్ట వేశారు. అయినా నీటి ప్రవాహం ఆగడం లేదు. లీకులు వస్తున్న ప్రాంతంలో రిజర్వాయర్‌ లోపలి భాగంలో టిప్పర్లతో సమీప కొండ నుండి ఎర్ర గ్రావెల్‌ తీసుకొచ్చి చదునుచేసే ప్రక్రియ చేపడుతున్నారు. ఒకవైపు, కట్టవద్ద లీకుల ప్రాంతంలో నివారణ చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.

తగ్గని లీకేజి ఉదృతి..
లీకుల వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

 నీరు తగ్గేవరకు వేచిచూడడమే అంటున్న అఽధికారులు

సహాయక చర్యలు వల్ల ఫలితం శూన్యం

పామూరు, డిసెంబరు 4: మండలంలోని మోపాడు జలాశయం కట్టకు ఏర్పడ్డ లీకుల నుంచిఉబికి వస్తున్న రిజర్వాయర్‌ నీటిని ఇప్పట్లో అడ్డుకట్టపడే పరిస్థితి కానరావడం లేదు. కట్టుకు ఏర్పడిన  లీకులను కట్టడి చేసేందుకు ఇరిగేషన్‌శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. లీకుల వద్ద నీటిని అరికట్టేందుకు ఇప్పటి వరకు 5 వేల బస్తాల ఇసుక, కంకర కలిపిన మిశ్రమాన్ని అడ్డుకట్ట వేశారు. అయినా నీటి ప్రవాహం ఆగడం లేదు. లీకులు వస్తున్న ప్రాంతంలో రిజర్వాయర్‌ లోపలి భాగంలో టిప్పర్లతో సమీప కొండ నుండి ఎర్ర గ్రావెల్‌ తీసుకొచ్చి చదునుచేసే ప్రక్రియ చేపడుతున్నారు. ఒకవైపు, కట్టవద్ద లీకుల ప్రాంతంలో నివారణ చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కొండల నుంచి వరదనీరు మన్నేరు వాగులోకి ప్రవహిస్తుండడంతో మోపాడు రిజర్వాయర్‌ అలుగు పారుతూనే ఉంది. అలుగు వద్ద 5 అడుగుల వెడల్పు మేర కాలువ తీసి అలుగు ప్రవాహాన్ని మన్నేరు వాగులోకి వదులుతన్నారు. ఇంతా చేసినా రిజర్వాయర్‌లో ఇప్పటి వరకు ఒక్కఅడుగు మాత్రమే నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతానికి 29 అడుగుల నీటిమట్టం నమోదైంది. రిజర్వాయర్‌లో మరో నాలుగు అడుగుల మేర నీటిమట్టం తగ్గితే కానీ సహాయక చర్యలు వేగంగా చేపట్టవచ్చునని అధికారులు లెక్కలు వేస్తున్నారు. రిజర్వాయర్‌ అలుగు కట్టవద్ద అప్పటి బ్రిటీష్‌ పాలకులు 1935వ సంవత్సరంలో వేసిన శిలాఫలకం బయటపడింది. అప్పటి బ్రిటీషు పాలకులు ఎంతో నైపుణ్యంతో తయారు చేయించిన రాయితో పాటు సీసంతో కట్టిన అలుగు నిర్మాణ పనుల గురించి ప్రజలు బ్రిటీషు పాలకుల నాటి ఇంజనీర్ల పనితీరును మెచ్చుకుంటున్నారు.


Updated Date - 2021-12-05T05:26:06+05:30 IST