భూగర్భంలో ఇళ్లు!

ABN , First Publish Date - 2020-11-10T06:28:24+05:30 IST

దూరం నుంచి చూస్తే ఎడారిని తలపించే ఆ పట్టణంలో అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉన్న ఇళ్లు కనిపిస్తాయి.

భూగర్భంలో ఇళ్లు!

దూరం నుంచి చూస్తే ఎడారిని తలపించే ఆ పట్టణంలో అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉన్న ఇళ్లు కనిపిస్తాయి. కొన్ని రెస్టారెంట్లు, పోలీ్‌సస్టేషన్‌, స్కూల్‌, ఆస్పత్రి ఉంటాయి. కానీ ఓ దగ్గర సొరంగ మార్గం నుంచి లోపలికి వెళితే భూగర్భంలో మరో ఊరిని చూడొచ్చు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందో తెలుసా?




ఆస్ట్రేలియాలో అడిలైడ్‌కు  850 కిలోమీటర్ల దూరంలో ‘కూబర్‌ పెడీ’ అని ఒక చిన్న పట్టణం ఉంది. దూరం నుంచి చూస్తే ఆ ప్రాంతం అంతా ఎడారిలా కనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని ఇళ్లు కనిపిస్తాయి. 

1.అంతగా అభివృద్ధి చెందని పట్టణమేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ భూగర్భంలో అబ్బురపరిచే నిర్మాణాలున్నాయి.

2.నేల మీద ఎన్ని ఇళ్లు ఉంటాయో, భూగర్భంలోనూ అన్ని ఇళ్లు కనిపిస్తాయి. ఆ ఇళ్లలో సకల వసతులు ఉంటాయి. 

3.కిచెన్‌, లివింగ్‌రూమ్స్‌, బెడ్‌రూమ్‌ ఉంటాయి. చర్చి, గ్రంథాలయం, హోటల్స్‌, బార్స్‌... ఇలా అన్ని సదుపాయాలు ఉంటాయి. 

4.భూగర్భంలో ఇళ్లు కట్టుకుని ఉండడానికి కారణం అక్కడ ఎండ ఎక్కువగా ఉండడం. వేసవిలో అక్కడ 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. 

5.ఆ వేడి నుంచి తప్పించుకునేందుకు భూగర్భంలో ఇళ్లు కట్టుకున్నారు. అన్ని గదులకు వెంటిలేషన్‌ ఏర్పాటు వల్ల లోపల చల్లగా ఉంటుంది.


Updated Date - 2020-11-10T06:28:24+05:30 IST