అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-08-09T05:35:39+05:30 IST

హైదరా బాద్‌ నుంచి బెంగుళురు వరకు ఉన్న 44వ జాతీయ రహదారి ఆరులైన్లుగా విస్తరించనున్న నేప థ్యంలో అవసరమున్న చోట అం డర్‌ పాస్‌లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బ్రిడ్జిలు, సబ్‌వే రోడ్లు నిర్మించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి కోరారు.

అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయాలి
నేషనల్‌ హైవే రిజినల్‌ అధికారికి వినతి పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే ఆల

- నేషనల్‌ హైవే రిజినల్‌ అధికారిని కలిసిన ఎమ్మెల్యే ఆల

భూత్పూర్‌, ఆగస్టు 8: హైదరా బాద్‌ నుంచి బెంగుళురు వరకు ఉన్న 44వ జాతీయ రహదారి ఆరులైన్లుగా విస్తరించనున్న నేప థ్యంలో అవసరమున్న చోట అం డర్‌ పాస్‌లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బ్రిడ్జిలు, సబ్‌వే రోడ్లు నిర్మించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి కోరారు. సో మవారం హైదరాబాద్‌లో  నేషన ల్‌ హైవే తెలంగాణ రిజినల్‌ అధి కారి కృష్ణప్రసాద్‌ను ఎమ్మెల్యే ఆల వినతిపత్ర్నాన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకద్ర నియోజవర్గంలోని భూత్పూర్‌ నుంచి కొత్తకోట వరకు దాదాపుగా 70 కిలోమీటర్ల పొడువునా రహదారి విస్తరించి ఉందని, అయితే చాలా గ్రామాలు రహదా రికి అనుకొని ఉండటంతో గతంలో చాలా ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కో ల్పోయారన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకోని పక్కా ప్రణాళికలతో రహదారిని విస్తరిం చాలని కోరారు. ఆయన వెంట ఎంపీ ప్రత్యేక కార్యదర్శి రవీందర్‌రెడ్డి ఉన్నారు.   

Updated Date - 2022-08-09T05:35:39+05:30 IST