నన్ను నేను అర్థం చేసుకుంటున్నా: Amala Paul

Published: Wed, 06 Jul 2022 14:12:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నన్ను నేను అర్థం చేసుకుంటున్నా: Amala Paul

తనను తాను అర్థం చేసుకునే స్థితిలో ఇపుడు ఉన్నానని, అందువల్ల రెండో పెళ్ళి గురించి ఆలోచన చేసే సమయం లేదని సినీ నటి అమలాపాల్‌ (Amala Paul) చెప్పుకొచ్చింది. కోలీవుడ్‌ దర్శకుడు ఏఎల్‌.విజయ్‌ (A L Vijay)ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమలాపాల్‌.. కొంతకాలం తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న అమల, తనకు నచ్చిన కథా చిత్రాల్లో నటిస్తూ సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్లు, తన అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైనశైలిలో సమాధానాలిస్తోంది. 

తాజాగా, ఓ అభిమాని అమలకు ఓ ప్రశ్న సంధించారు. ‘మిమ్మలను పెళ్ళి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి’ అని అడిగ్గా, దానికి ఆమె సమాధానమిస్తూ.. ‘అలాంటి అర్హతలు ఎంటో ఇంకా నాకు తెలియ లేదు. ఇపుడు నన్ను నేను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను. నన్ను పెళ్ళి చేసుకునేందుకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసుకుని మీకు చెప్తాను’ అని కూల్‌గా సమాధానమిచ్చింది.

కాగా, అమలా పాల్ తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇతర భాషలలో కూడా తను నటించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. చెప్పాలంటే అమలా పాల్ తెలుగు కంటే తమిళ, మలయాళ, కన్నడ బాషలలోనే ఎక్కువగా సినిమా చేసి మంచి  క్రేజ్ తెచ్చుకుంది. తన కెరీర్‌లో ఓ డిఫరెంట్ మూవీ అంటే 'ఆమె'. ఇందులో బోల్డ్ పాత్ర చేసి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International