తగ్గని కొవిడ్‌ ఉధృతి

ABN , First Publish Date - 2022-01-24T04:58:14+05:30 IST

తగ్గని కొవిడ్‌ ఉధృతి

తగ్గని కొవిడ్‌ ఉధృతి

చేవెళ్ల/ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు, జనవరి 23: జిల్లాలో కొవిడ్‌ ఉధృతి తగ్గడంలేదు. చేవెళ్ల డివిజన్‌ పరిధిలో ఆదివారం 176మందికి వైద్యపరీక్షలు చేయగా 60మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 33మందికి గానూ 10మందికి, శంకర్‌పల్లిలో 55మందికి గానూ 19మందికి, షాబాద్‌లో 31మందికి గానూ 12మందికి, మొయినాబాద్‌లో 57మందికి గానూ 19మందికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 270మందికి కొవిడ్‌ టెస్టులు చేయగా 36మందికి పాజిటివ్‌ వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 30, మంచాలలో నాలుగు, ఆరుట్ల, ఎలిమినేడులో ఒక్కొక్కరి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 51మందికి టెస్టులు చేయగా 16మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి తెలిపారు. తలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 45మందికి గానూ ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ శారద తెలిపారు. 

కొనసాగుతున్న ఫీవర్‌సర్వే..

ఇబ్రహీంపట్నం/యాచారం, జనవరి 23: ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జ్వరసర్వేలో భాగంగా ఇబ్రహీంపట్నంలో ఆదివారం 198 టీంలు సర్వేను చేపట్టాయి. 7439ఇళ్లను సందర్శించి 158మందికి కొవిడ్‌ లక్షణాలు బయటపడడంతో వారికి మందులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 22,550ఇళ్లను సందర్శించి 537కిట్లను పంపిణీ చేసినట్లు జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్‌ నాగజ్యోతి తెలిపారు. అదేవిధంగా యాచారం మండలంలోని 24గ్రామపంచాయతీల్లో ఆదివారం  24బృందాలు 905ఇళ్లలో 2,487మందిని సర్వేచేయగా 23మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి మందులు అందించామని ఇన్‌చార్జి వైద్యురాలు డాక్టర్‌ ఉమ, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటి వరకు 86మందికి మందులు అందజేసినట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-24T04:58:14+05:30 IST