కాకినాడలో కదంతొక్కిన నిరుద్యోగులు

ABN , First Publish Date - 2021-06-22T06:27:55+05:30 IST

భానుగుడి (కాకినాడ), జూన్‌ 19: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో పోలీసు శాఖను నమ్ము కున్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, 6,500 పోలీసు పోస్టులతో మళ్లీ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించా లంటూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. కాకినాడ భానుగుడి సెంటర్‌ వద్ద

కాకినాడలో కదంతొక్కిన నిరుద్యోగులు
కాకినాడ భానుగుడి సెంటర్‌లో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న నిరుద్యోగులు

6,500 పోలీసు ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ 

మళ్లీ ప్రకటించాలని డిమాండు

భానుగుడి (కాకినాడ), జూన్‌ 19: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో పోలీసు శాఖను నమ్ము కున్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, 6,500 పోలీసు పోస్టులతో మళ్లీ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించా లంటూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. కాకినాడ భానుగుడి సెంటర్‌ వద్ద సుమారు రెండు గంటలపాటు నిరుద్యోగులు నిరసన చేపట్టడంతోపాటు తమ ఆవేదనను వాహనదారులతో చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. గత రెండు సంవత్సరాలుగా పోలీసు శాఖలో ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, ఎన్నో కలలతో వేచి చూస్తున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం ఇలా కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. పోలీసు ఉద్యోగంపై ఇష్టంతో ఎన్నో ఉద్యోగాలను వదులుకుని ఉన్నామని, ఇప్పుడు జాబ్‌ క్యాలెం డర్‌లో 450 పోస్టులు మాత్రమే ఇచ్చి తమ ఆశలను ఆశలను అడియాసలు చేశారని వారంతా వాపోయారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, శిక్షణలు పొందుతూ, ఒక్కొసారి పస్తులు ఉంటూ జీవనం సాగిస్తున్నామని, తమ ఆశలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. పోస్టుల సంఖ్యను పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని, తక్షణమే 6,500 పోలీసుశాఖ పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-06-22T06:27:55+05:30 IST