పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లిచేసుకున్నారు... మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుకు వెళితే.. అక్కడ ఊహించని సీన్..

ABN , First Publish Date - 2021-12-23T22:16:55+05:30 IST

కర్నాటకలో ఓ ప్రేమజంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రిజిస్టర్ ఆఫీసుకు వెళితే... అక్కడ వారికి ఊహించని ఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళితే...

పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లిచేసుకున్నారు... మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుకు వెళితే.. అక్కడ ఊహించని సీన్..

కులాలు వేరనో, ఆస్తిపాస్తులు లేవనో.. ఇలా వివిధ కారణాలతో ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు అడ్డు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో పెద్దలను ఎదిరించలేక కొందరు రాజీపడుతుంటే.. మరికొందరు మాత్రం వారిని ఎదిరించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ప్రేమికులు దంపతులుగా మారే క్రమంలో ఎన్నో ట్విస్టులు, అడ్డంకులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొందరు వాటిని అన్నింటినీ దాటుకుంటూ వెళ్లి పెళ్లి పీటలు ఎక్కుతుంటారు. కర్నాటకలో ఓ ప్రేమజంట కూడా ఇలాగే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రిజిస్టర్ ఆఫీసుకు వెళితే... అక్కడ వారికి ఊహించని ఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళితే...


కర్ణాటకలోని హరాళే గ్రామానికి చెందిన మహేంద్ర అనే యువకుడు, చిత్ర అనే యువతి కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో బయటకు తెలిస్తే.. పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో ప్రేమ విషయాన్ని బయటపెట్టేవారు కాదు. అయితే ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలని భావించారు. ఓ రోజు ఇద్దరూ వారి వారి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అయితే యువతి తండ్రి బసవరాజు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘‘అతడి కులం వేరు.. పెళ్లి చేసుకుంటే మా పరువు ఏంకావాలి, మేము చెప్పిన సంబంధం మాత్రమే చేసుకోవాలి’’.. అని కండీషన్ పెట్టారు.

స్మార్ట్‌ఫోన్‌కు బ్యాండు బాజాల మధ్య.. గుర్రపు బండిపై ఊరేగింపు.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..


తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో యువతి తీవ్ర ఆందోళనకు గురైంది. విషయాన్ని తన ప్రియుడికి తెలియజేసింది. పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ డిసెంబర్ 8న ఇంటి నుంచి వెళ్లిపోయి, రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లగానే ఆఫీసులో యువతి తండ్రి బసవరాజు ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. కూతురును చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి దుర్భాషలాడుతూ దాడి చేశాడు. మా పరువు తీస్తావా.. అంటూ కూతురు జుట్టు పట్టుకుని కొట్టడం మొదలెట్టాడు.

తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..


కూతురును లాక్కుంటూ వెళ్తుండగా ఆఫీసులో ఉన్న వారంతా బసవరాజును అడ్డుకున్నారు. అంతా సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణిగింది. యువతి తన భర్తతో కలిసి నేరుగా  నంజన్‌గుడ్ పోలీసులను సంప్రదించింది. తన తండ్రి దాడికి సంబంధించిన వీడియోను చూపిస్తూ.. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బసవరాజును స్టేషన్‌కు పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతీయువకులు మేజర్లు కావడంతో వారిని ఇబ్బందిపెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!

Updated Date - 2021-12-23T22:16:55+05:30 IST