ప్రముఖ నటుడి ఇంట్లో హల్‌చల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి!

ABN , First Publish Date - 2021-03-22T18:29:37+05:30 IST

ప్రముఖ నటుడి ఇంట్లోకి దూరిన ఓ గుర్తు తెలియని వ్యక్తి హచ్‌చల్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు జాని డెప్.. లాస్ ఏంజి

ప్రముఖ నటుడి ఇంట్లో హల్‌చల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి!

కాలిఫోర్నియా: ప్రముఖ నటుడి ఇంట్లోకి దూరిన ఓ గుర్తు తెలియని వ్యక్తి హచ్‌చల్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు జాని డెప్.. లాస్ ఏంజిల్స్‌లోని హాలివుడ్ హిల్స్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కాగా.. గత రాత్రి జాని డెప్ నివసిస్తున్న ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. దీన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాగా.. పోలీసులు వచ్చే సమయానికి సదరు వ్యక్తి.. జాని డెప్ ఇంట్లోని ఓ బాత్‌రూంలో ఎంచక్కా స్నానం చేస్తుండటంతో అది చూసి.. అధికారులు కంగుతిన్నారు. అంతేకాకుండా జాని డెప్ ఇంట్లోని మద్యాన్ని కూడా అతను సేవించినట్టు పోలీసులు గుర్తించారు. అనతరం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జైలుకు తరలించారు. 


Updated Date - 2021-03-22T18:29:37+05:30 IST