గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య

Published: Wed, 06 Jul 2022 00:15:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య  రహదారిపై చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

మాధవధార, జూలై  5 : జాతీయ రహదారిపై బిర్లా జంక్షన్‌ దరి డీమార్ట్‌  ఎదురుగా గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి కేబుల్‌ వైర్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు వేలాడుతున్న ఈ యువకుడి మృతదేహాన్ని  మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించి, ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి వయస్సు 25-30 మధ్య ఉండవచ్చని, ఆయన ఎడమ చేతిపై ‘సమీర్‌’ అని ఇంగ్లీష్‌లో టాటూ వేసివుందని వివరించారు. సంబంధీకులు తమను సంప్రదించాలని ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు కోరారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.