ఆప్కోను ఆదుకోగల యూనిఫాం దుస్తులు

ABN , First Publish Date - 2021-11-11T06:07:06+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాం వస్త్రాల్ని ఇదివరకు ఆప్కో సంస్థ అందించేది. సరైన ప్రోత్సాహం లేని కారణంగా నేడు యూనిఫాంలకు అవసరమైన వస్త్ర సరఫరాలో ఐదో వంతు మాత్రమే ఆప్కో అందించగలుగుతోంది...

ఆప్కోను ఆదుకోగల యూనిఫాం దుస్తులు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాం వస్త్రాల్ని ఇదివరకు ఆప్కో సంస్థ అందించేది. సరైన ప్రోత్సాహం లేని కారణంగా నేడు యూనిఫాంలకు అవసరమైన వస్త్ర సరఫరాలో ఐదో వంతు మాత్రమే (ఇరవై లక్షల మీటర్లు) ఆప్కో అందించగలుగుతోంది. పూర్తిగా సరఫరా చేయనందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమూ, అధికారులూ చేనేతకు బదులుగా పవర్ లూమ్ నుంచి వస్త్రాల్ని కొనుగోలు చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రపంచ విపణిలో చేనేతకు ఎంతో ఆదరణ ఉండగా మనం నామోషీగా భావిస్తున్నాం. చర్మవ్యాధుల నుంచి రక్షణ, వాతావరణ సమతౌల్యాన్ని కాపాడటం వంటి అనేక చేనేత ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయాలి. పండగలకే కాకుండా అన్ని కాలాల్లోనూ చేనేతపై రాయితీ కొనసాగించాలి. గత ప్రభుత్వం ఆదరణ పథకంలో భాగంగా కేవలం పది శాతం ధరకే మగ్గాలను అందించింది. ఇప్పుడూ దాన్ని కొనసాగించాలి. యూనిఫామ్ దుస్తులకు అవసరమైన కోటి మీటర్ల వస్త్ర సరఫరాకు ‘ఆప్కో’ను ప్రోత్సహిస్తే రాష్ట్రంలో గల చేనేత కార్మికులందరికీ పని లభించి ఆకలి బాధలు తొలగి ఆత్మస్థ్యైర్యంతో జీవించగలరు. 

యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

Updated Date - 2021-11-11T06:07:06+05:30 IST