ఉర్దూపై అనాలోచిత నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-22T10:18:24+05:30 IST

ఉర్దూ మీడియం స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం తీవ్ర అన్యాయం. ఇది ఉర్దూ మాతృభాషగా ఉన్న ముస్లిం పిల్లలను...

ఉర్దూపై అనాలోచిత నిర్ణయం

ఉర్దూ మీడియం స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం తీవ్ర అన్యాయం. ఇది ఉర్దూ మాతృభాషగా ఉన్న ముస్లిం పిల్లలను ఆ భాషకు దూరం చేయడమే కాక, ఉర్దూ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఉర్దూ మీడియంలో చదువుకున్న ఉపాధ్యాయులు ఇంగ్లీష్ బోధన చేయడం అంటే కత్తిమీద సాము చేయడమే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనాలోచితమైనది. మాతృభాషలో చదువుకునే హక్కును హరించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఎన్నో ఏళ్లుగా ఉర్దూ మీడియంలో చదువులు చెబుతున్న ఉపాధ్యాయులకు మొక్కుబడిగా వారం పది రోజులు శిక్షణ ఇస్తే, వారు ఇంగ్లీషు మీడియంలో పాఠాలు ఎలా చెప్పగలరు? ఉన్నపళంగా మాధ్యమాన్ని మార్చడం అశాస్త్రీయం. ఉర్దూ భాష మాధ్యమాన్ని తీసివేస్తే ఆ భాష మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

అబ్దుల్ అజీజ్

Updated Date - 2022-06-22T10:18:24+05:30 IST