సాగు చట్టాలను మళ్లీ తెస్తాం: కేంద్రమంత్రి సంచలన ప్రకటన

Published: Sat, 25 Dec 2021 14:30:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సాగు చట్టాలను మళ్లీ తెస్తాం: కేంద్రమంత్రి సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: ఇటీవల రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తెస్తామంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని, భవిష్యత్తులో మళ్లీ ముందుకు వెళ్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తామని ప్రకటించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు వారం క్రితమే శిబిరాలను ఖాళీ చేసి వెళ్లారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి తోమర్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.